Wednesday, 17 June 2026
  • Home  
  • జంట హత్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక డిమాండ్
- News

జంట హత్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక డిమాండ్

*బ్రహ్మంగారిమఠం జంట హత్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక డిమాండ్* శ్రీ వంగిపురం రెడ్డన్న గారి ఆశయాలను ముందుకు తీసుకెళుతూ, కడప జిల్లా అధ్యక్షులు ఓబిగాండ్ల ఓబయ్య గారి సూచనల మేరకు, 16-06-2026 తేదీన *ఆంధ్రప్రదేశ్* *దళిత వేదిక జిల్లా కన్వీనర్ ** బింగి ఓబులేసు* గారు *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ జవహర్ బాబు గారిని* మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మంగారిమఠం మండలంలో జరిగిన దారుణమైన జంట హత్యల ఘటనపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బింగి ఓబులేసు మాట్లాడుతూ, బ్రహ్మంగారిమఠం మండలంలో జరిగిన జంట హత్యలు అత్యంత అమానవీయమైనవి, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి, నిష్పక్షపాత విచారణ జరిపి అసలు నిందితులను గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు తగిన న్యాయం, ఆర్థిక సహాయం మరియు పూర్తి భద్రత కల్పించాలని కోరారు. దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, వివక్షకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ వినతిపై ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ జవహర్ బాబు గారు సానుకూలంగా స్పందించి, ఘటనపై తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని, బాధిత కుటుంబాలను త్వరలో కలుస్తామని వారిని పరామర్శించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

*బ్రహ్మంగారిమఠం జంట హత్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక డిమాండ్*
శ్రీ వంగిపురం రెడ్డన్న గారి ఆశయాలను ముందుకు తీసుకెళుతూ, కడప జిల్లా అధ్యక్షులు ఓబిగాండ్ల ఓబయ్య గారి సూచనల మేరకు, 16-06-2026 తేదీన *ఆంధ్రప్రదేశ్* *దళిత వేదిక జిల్లా కన్వీనర్ ** బింగి ఓబులేసు* గారు *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ జవహర్ బాబు గారిని* మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మంగారిమఠం మండలంలో జరిగిన దారుణమైన జంట హత్యల ఘటనపై వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బింగి ఓబులేసు మాట్లాడుతూ, బ్రహ్మంగారిమఠం మండలంలో జరిగిన జంట హత్యలు అత్యంత అమానవీయమైనవి, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి, నిష్పక్షపాత విచారణ జరిపి అసలు నిందితులను గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అలాగే బాధిత కుటుంబాలకు తగిన న్యాయం, ఆర్థిక సహాయం మరియు పూర్తి భద్రత కల్పించాలని కోరారు. దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, వివక్షకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ వినతిపై ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ జవహర్ బాబు గారు సానుకూలంగా స్పందించి, ఘటనపై తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని, బాధిత కుటుంబాలను త్వరలో కలుస్తామని వారిని పరామర్శించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.