పున్నమి న్యూస్ కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాజీవితంలో తమ కుటుంబం నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజలకు, సమాజానికి సేవ చేస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల అచ్యుత రామయ్య తెలిపారు.
కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ కుటుంబం ఎప్పుడూ స్వలాభం కోసం గానీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసంగానీపనిచేయలేదన్నారు. ప్రజా సేవ, సమాజ సంక్షేమమే తమ కుటుంబం లక్ష్యమని,పేర్కొన్నారు.అయితే, కొంతమంది వ్యక్తులు చట్టవ్యతిరేకమైన వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతూ తన పేరును ఉపయోగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అచ్యుత రామయ్య తెలిపారు. ఇటువంటి అక్రమ, చట్టవ్యతిరేక కార్యకలాపాలను తాము ఎప్పుడూప్రోత్సహించలేదని స్పష్టం చేశారు.తన పేరు చెప్పుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తన పేరును దుర్వినియోగం చేస్తూ అక్రమ వ్యాపారాలకు పాల్పడే వ్యక్తులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

సమాజ సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం పెండ్యాల అచ్యుత రామయ్య
పున్నమి న్యూస్ కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాజీవితంలో తమ కుటుంబం నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజలకు, సమాజానికి సేవ చేస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల అచ్యుత రామయ్య తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ కుటుంబం ఎప్పుడూ స్వలాభం కోసం గానీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసంగానీపనిచేయలేదన్నారు. ప్రజా సేవ, సమాజ సంక్షేమమే తమ కుటుంబం లక్ష్యమని,పేర్కొన్నారు.అయితే, కొంతమంది వ్యక్తులు చట్టవ్యతిరేకమైన వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతూ తన పేరును ఉపయోగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అచ్యుత రామయ్య తెలిపారు. ఇటువంటి అక్రమ, చట్టవ్యతిరేక కార్యకలాపాలను తాము ఎప్పుడూప్రోత్సహించలేదని స్పష్టం చేశారు.తన పేరు చెప్పుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తన పేరును దుర్వినియోగం చేస్తూ అక్రమ వ్యాపారాలకు పాల్పడే వ్యక్తులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

