గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలపై ప్రజా సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. తాగునీటి కొరత, దెబ్బతిన్న రహదారులు, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల కొరత వంటి అంశాలపై ప్రజలు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ర్యాలీలు, నిరసన కార్యక్రమాలకు స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థలు ప్రజల అవసరాలను గుర్తించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


