Wednesday, 24 June 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ‘మీ ఇంటికి మీ సుధీరన్న’ ప్రచార కార్యక్రమ ప్రణాళిక సిద్ధం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ‘మీ ఇంటికి మీ సుధీరన్న’ ప్రచార కార్యక్రమ ప్రణాళిక సిద్ధం

శ్రీ కాళహస్తి, జూన్ 23, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నాడు నియోజకవర్గ కూటమి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పిలుపు మేరకు ప్రతి గడపకూ కూటమి ప్రభుత్వ సంక్షేమాన్ని, ప్రగతిని వివరించేందుకు ఈ నెల 25 నుండి ఆగస్టు 10 వరకు నియోజకవర్గ వ్యాప్తంగా ‘మీ ఇంటికి మీ సుధీరన్న’ అనే డోర్-టు-డోర్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సమావేశంలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దిశా నిర్దేశం చేసి పక్కా ప్రణాళికను రూపొందించారు. ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ అభివృద్ధిని వివరించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.