కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాలను గౌరవిస్తూ, కార్మికుల కృషిని మరియు సమాజానికి వారు చేస్తున్న సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (‘మే’ డే) గా జరుపుకుంటాము.1886 మే 1న అమెరికాలోని చికాగోలో 8గంటల పని దినం కోసం కార్మికులు చేసిన ‘హేమార్కెట్’ ఉద్యమం గుర్తుగా ఈ రోజును జరుపుకోవడం ప్రారంభమైంది. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1923, మే1న చెన్నైలో ‘లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్’ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం 2026లో ఇది కేవలం వేడుకలకే పరిమితం కాకుండా కార్మికుల మానసిక ఆరోగ్యం, మహిళా సాధికారత మరియు సుస్థిర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా శ్రమశక్తి కి జేజేలు అంటూ అందరికి కవితాత్మక శుభాకాంక్షలు.
🌹🌹🌹✊✊✊✊✊✊✊🌹🌹🌹
*శ్ర* శ్రమే మానవ జీవన గమనానికి పరిపూర్ణ స్థితి
*మ* మనసుపెట్టి పక్కవాని భుజం తట్టి
*శ* శారీరక శక్తిని యుక్తితో వినియోగించి
*క్తి* కీర్తిపొందగ క్రమశిక్షణతో పనిసామర్థ్యం పెంచగ
*కి* కిరాయి పొందగ కాల నియమాలకు కట్టుబడగ
*జే* వస్తుత్పత్తికి తపించే శ్రమజీవి అంతరంగాత్మకం
*జే* జయంగా సాగే నిత్యయవ్వన కార్మికలోకం
*లు* లున్నతము చేయగ జీవనప్రమాణ గమనాంకం
*కా* కార్మికశక్తి సౌభాగ్యసిద్ధికి మూలకం
*ర్మి* రివ్వున సాగే ప్రయాణానికి స్వయంచాలకం
*క* కష్టసుఖాల ఆత్మీయ అనుబంధ దీపకం
*ది* దినకరుని అనుసరించు దివ్యశక్తి దాయకం
*నో* నూతనోత్సాహంతో ప్రతిపనిలో మమేకం
*త్స* ఉత్సవశోభల పరిమళం నిత్య పనిపూరకం
*వం* వందే మనతరం నిరంతరం అనుభవపూర్వకం
*మే* మేల్కొన్న శ్రమలోకం నిరంకుశభావ నిర్మూలకం
*డే* డే అండ్ నైట్ ప్రకాశించు శ్రమశక్తి భూమాత చైతన్యతిలకం
కార్మిక ఐక్యతా భావాలు
శ్రామిక శక్తికి జేజేలు
మెరిసే మే డే ఉత్సవాలు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

