శ్రీ కాళహస్తి, జూన్ 15, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తిలోని స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ‘సర్’ (SIR) ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ‘సర్’ ప్రక్రియ పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అంశాలు, పార్టీ శ్రేణుల భాగస్వామ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. SIR ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీనిని క్షేత్రస్థాయిలో పూర్తి పారదర్శకతతో, సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి, ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి నిరంతరం అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నాయని కొనియాడారు. ఇదే ఉత్సాహంతో ఈ ప్రక్రియను విజయవంతం చేసి, ప్రజలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి ఓడూరు గిరిధర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ వయ్యాల కృష్ణారెడ్డి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గున్నేరి కిషోర్ రెడ్డి, ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్, నాగార్జున రెడ్డి, బత్తి శెట్టి, తొట్టంబేడు మండల ప్రెసిడెంట్ కోగిలి సుబ్రహ్మణ్యం, కాపులూరి వెంకీ కంట ఉదయ్ కుమార్, మున్నా రాయల్, బుల్లెట్ జయ శ్యామ్ రాయల్, అస్లాం, పసల కృష్ణయ్య, జనార్దన్ యాదవ్, మధు మోహన్ రెడ్డి, ముని రాజ, వెంకటేశ్వరులు నాయుడు, గురునాధం అంకయ్య, వేణు తదితర వైసీపీ శ్రేణులు, లీగల్ సెల్ టీం, రిటైర్డ్ టీచర్లు పాల్గొన్నారు.

వైసీపీ కార్యాలయంలో ‘సర్’ ప్రక్రియపై సమీక్ష