ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్ ప్రతి నిధి)
ఖమ్మం నగర పరిధిలోని వీడియోస్ కాలనీ 54వ డివిజన్‌లో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ పార్క్ స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తోంది. పార్క్ నిర్మాణం పూర్తవడంతో డివిజన్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేందుకు ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయగా, ఆరోగ్యాన్ని కాపాడుకునేలా పలు రకాల ఆధునిక వ్యాయామ పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు.
చిన్నారుల కోసం వివిధ రకాల ఆట వస్తువులు, వినోద పరికరాలు ఏర్పాటు చేయడం వల్ల కుటుంబ సభ్యులు కలిసి సమయాన్ని ఆనందంగా గడిపే అవకాశం కలిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. పచ్చదనం నడుమ నిర్మించిన ఈ పార్క్ కాలనీవాసులకు విశ్రాంతి, వ్యాయామం, వినోదం కోసం అనువైన ప్రదేశంగా మారిందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఎన్టీఆర్ పార్క్ నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ తీసుకుని, అధికారులతో సమన్వయం చేస్తూ పనులు పూర్తి చేయడంలో విశేష కృషి చేసిన 54వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మిక్కిలి నేని మంజుల నరేంద్రకు డివిజన్ ప్రజలు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రజల అవసరాలను గుర్తించి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా డివిజన్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.


