ఖమ్మం, జులై
ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వివిధ మోర్చాల అధ్యక్షులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాసనాల సాయిరామ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మంద సరస్వతి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బండ్ల ప్రతాప్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆర్.వి.ఎస్. యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ, పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యకలాపాల విస్తరణ, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, రాబోయే కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణపై నాయకులతో విస్తృతంగా చర్చించారు. ప్రతి మోర్చా సమన్వయంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
రాబోయే రోజుల్లో చేపట్టనున్న పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.



