Tuesday, 21 July 2026
  • Home  
  • విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు “షైనింగ్ స్టార్స్” నిదర్శనం* *258 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రధానం చేసిన మంత్రి
- తిరుపతి

విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు “షైనింగ్ స్టార్స్” నిదర్శనం* *258 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రధానం చేసిన మంత్రి

జిల్లా ఇన్‌చార్జి మరియు రాష్ట్ర రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ *విద్యార్థుల ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడమే సమాజ ప్రగతికి అసలైన పునాది* జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్* పున్నమి ప్రతినిధి,తిరుపతి, జూలై 20 విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు షైనింగ్ స్టార్స్ నిదర్శనమని జిల్లా ఇన్‌చార్జి మరియు రాష్ట్ర రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన “షైనింగ్ స్టార్స్–2026” ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, విద్యార్థుల విజయోత్సాహంతో పండుగ వాతావరణంలో జరిగింది. తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి మరియు రాష్ట్ర రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, రైల్వే కోడూరు, సూళ్లూరుపేట,ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్, నెలవల విజయశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్, ఆర్‌.ఐ.ఓ గోపాల్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు నరసింహ యాదవ్, సి.ఆర్. రాజన్, సదాశివం, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… విద్యావంతుడు, దూరదృష్టి కలిగిన నాయకుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యారంగంలో ఎంతటి మార్పులు సాధ్యమవుతాయో “షైనింగ్ స్టార్స్” కార్యక్రమమే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ఒకప్పుడు దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్ర విద్యా వ్యవస్థ గత ప్రభుత్వ హయాంలో వెనుకబడిందని, అయితే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా రంగాన్ని సవాల్‌గా స్వీకరించి సంస్కరణలను వేగవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడం, నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు, నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజన పథకం పునరుద్ధరణ, 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ వంటి కార్యక్రమాలు విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని వివరించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పేరెంట్–టీచర్ సమావేశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఈ నెల 24న నిర్వహించే సమావేశాలకు ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. తిరుపతి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గతంలో ప్రతిభా పురస్కారాలు కొద్దిమంది విద్యార్థులకే పరిమితమయ్యేవని, ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన అన్ని విభాగాల ప్రతిభావంతులైన 258 మంది విద్యార్థులను ఒకే వేదికపై సత్కరించడం విద్యారంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని మంత్రి అభినందించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడమే సమాజ అభివృద్ధికి అసలైన పునాది అని పేర్కొన్నారు. పిల్లల విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రెండు చక్రాల్లాంటి వారని, ఈ ఇద్దరి సమిష్టి కృషితోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని తెలిపారు. ప్రతి విద్యార్థికి తనకంటూ ప్రత్యేకమైన ప్రతిభ, వ్యక్తిత్వం ఉంటుందని, పక్కింటి పిల్లలతో గానీ, ఇతరులతో గానీ పోల్చడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మార్కులే జీవిత విజయానికి కొలమానం కాదని, మంచి వ్యక్తిత్వం, నైపుణ్యాలు, క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని అన్నారు. విద్యార్థులు చిన్న లక్ష్యాలతో సరిపెట్టుకోకుండా పెద్ద కలలు కనాలని, “నక్షత్రాలను లక్ష్యంగా పెట్టుకుంటే కనీసం మేఘాల వరకైనా చేరుకుంటారు” అనే సూక్తిని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకునేలా తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాను తాను స్వయంగా కలిసిన అనుభవాన్ని పంచుకున్న కలెక్టర్, అలాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు తమ లక్ష్యాల సాధనలో ముందుకు సాగాలని సూచించారు. తన చిన్ననాటి నాసా కల, వైద్య విద్య, అనంతరం సివిల్ సర్వీసెస్ వరకు సాగిన ప్రయాణాన్ని వివరిస్తూ, విద్యార్థుల ఆసక్తులను గుర్తించి తల్లిదండ్రులు సరైన దిశలో ప్రోత్సహించాలని కోరారు. ఈ రోజు వేదికపై మెరిసిన ప్రతి “షైనింగ్ స్టార్” వెనుక ఒక ఉపాధ్యాయుడి కృషి దాగి ఉందని కలెక్టర్ కొనియాడారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడం గురువుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలు, సంగీతం, కళలు వంటి పాఠ్యేతర కార్యక్రమాల్లోనూ విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. ఇవి ఒత్తిడిని తగ్గించి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని తెలిపారు. తాను సివిల్స్‌కు సిద్ధమవుతున్న సమయంలో కూడా క్రీడలు, ఇతర అభిరుచులకు సమయం కేటాయించడం వల్ల మానసిక ఒత్తిడిని అధిగమించగలిగానని వివరించారు. తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ… విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పరీక్షలను విద్యార్థులు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. విద్యే జీవితంలో ఎవరూ దోచుకోలేని శాశ్వత సంపద అని పేర్కొంటూ, తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారి లక్ష్యసాధనకు తోడ్పడాలని సూచించారు. షైనింగ్ స్టార్స్–2026 కార్యక్రమం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్‌తో పాటు రూ.20,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా సన్మానించడం ద్వారా కుటుంబాల కృషిని గుర్తించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఇతర విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించి మరింత ప్రతిభ కనబర్చేందుకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థులకు వివిధ ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. చదువే శాశ్వత సంపద అని, విద్యతోనే వ్యక్తి, కుటుంబం, సమాజం గౌరవప్రదమైన స్థాయికి చేరుకుంటారని పేర్కొంటూ, అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేసి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సూళ్ళురుపేట ఎం.ఎల్.ఎ. మాట్లాడుతూ విద్య జీవితానికి బలమైన పునాది అని, చదువుతో పాటు క్రమశిక్షణ, నిజాయితీ, పెద్దల పట్ల గౌరవం, సమాజంలో మెలగడం వంటి విలువలను కూడా పాఠశాలలే నేర్పుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ‘వన్ క్లాస్–వన్ టీచర్’, లీప్ యాప్, పాఠశాలల్లో యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు, పోషకాహారం, మోడల్ స్కూల్స్ వంటి పలు సంస్కరణలు అమలు చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సీఎస్‌ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నందుకు అభినందించారు. తన నియోజకవర్గం నుంచి షైనింగ్ స్టార్స్‌గా ఎంపికైన విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని పల్లవిని ప్రత్యేకంగా ప్రశంసించారు. విద్యార్థులు బాగా చదవాలని, ఉపాధ్యాయులు, పెద్దలను గౌరవించాలని, నిజాయితీతో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ… కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, నిర్వాహకులు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నేడు సత్కారం అందుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి మరింత ప్రతిభ కనబరిచేందుకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. విద్యార్థులు పరీక్షలను ఒత్తిడిగా కాకుండా ఒక అవకాశంగా భావించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు వారికి మానసిక ధైర్యాన్ని అందించాలని సూచించారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ బోధన, విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలను సాధించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు అండగా నిలవాలని కోరారు. వన్నె కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను గతంలో పనిచేసిన రోజుల అనుభవాలను గుర్తు చేసుకుంటూ, సమాజంలో మార్పులు వచ్చినప్పటికీ సేవాభావం, సామాజిక బాధ్యత మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు సమాజంలో ఐక్యత, సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచన పెంపొందాలని సూచించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన 258 మంది విద్యార్థులకు “షైనింగ్ స్టార్స్–2026” పురస్కారాలు, చెక్కులు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి, వారిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దిశగా కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలకు ప్రతీకగా నిలిచిందని విద్యార్థులు, తల్లిదండ్రులు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్త పరిచారు. ఈ

జిల్లా ఇన్‌చార్జి మరియు రాష్ట్ర రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్

*విద్యార్థుల ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడమే సమాజ ప్రగతికి అసలైన పునాది*
జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్*

పున్నమి ప్రతినిధి,తిరుపతి, జూలై 20

విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు షైనింగ్ స్టార్స్ నిదర్శనమని జిల్లా ఇన్‌చార్జి మరియు రాష్ట్ర రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

సోమవారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన “షైనింగ్ స్టార్స్–2026” ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, విద్యార్థుల విజయోత్సాహంతో పండుగ వాతావరణంలో జరిగింది. తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి మరియు రాష్ట్ర రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి, రైల్వే కోడూరు, సూళ్లూరుపేట,ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్, నెలవల విజయశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్, ఆర్‌.ఐ.ఓ గోపాల్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు నరసింహ యాదవ్, సి.ఆర్. రాజన్, సదాశివం, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… విద్యావంతుడు, దూరదృష్టి కలిగిన నాయకుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యారంగంలో ఎంతటి మార్పులు సాధ్యమవుతాయో “షైనింగ్ స్టార్స్” కార్యక్రమమే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ఒకప్పుడు దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్ర విద్యా వ్యవస్థ గత ప్రభుత్వ హయాంలో వెనుకబడిందని, అయితే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా రంగాన్ని సవాల్‌గా స్వీకరించి సంస్కరణలను వేగవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడం, నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు, నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజన పథకం పునరుద్ధరణ, 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ వంటి కార్యక్రమాలు విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని వివరించారు.

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పేరెంట్–టీచర్ సమావేశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఈ నెల 24న నిర్వహించే సమావేశాలకు ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. తిరుపతి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గతంలో ప్రతిభా పురస్కారాలు కొద్దిమంది విద్యార్థులకే పరిమితమయ్యేవని, ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన అన్ని విభాగాల ప్రతిభావంతులైన 258 మంది విద్యార్థులను ఒకే వేదికపై సత్కరించడం విద్యారంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని మంత్రి అభినందించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడమే సమాజ అభివృద్ధికి అసలైన పునాది అని పేర్కొన్నారు. పిల్లల విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రెండు చక్రాల్లాంటి వారని, ఈ ఇద్దరి సమిష్టి కృషితోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని తెలిపారు. ప్రతి విద్యార్థికి తనకంటూ ప్రత్యేకమైన ప్రతిభ, వ్యక్తిత్వం ఉంటుందని, పక్కింటి పిల్లలతో గానీ, ఇతరులతో గానీ పోల్చడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మార్కులే జీవిత విజయానికి కొలమానం కాదని, మంచి వ్యక్తిత్వం, నైపుణ్యాలు, క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని అన్నారు. విద్యార్థులు చిన్న లక్ష్యాలతో సరిపెట్టుకోకుండా పెద్ద కలలు కనాలని, “నక్షత్రాలను లక్ష్యంగా పెట్టుకుంటే కనీసం మేఘాల వరకైనా చేరుకుంటారు” అనే సూక్తిని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకునేలా తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాను తాను స్వయంగా కలిసిన అనుభవాన్ని పంచుకున్న కలెక్టర్, అలాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు తమ లక్ష్యాల సాధనలో ముందుకు సాగాలని సూచించారు. తన చిన్ననాటి నాసా కల, వైద్య విద్య, అనంతరం సివిల్ సర్వీసెస్ వరకు సాగిన ప్రయాణాన్ని వివరిస్తూ, విద్యార్థుల ఆసక్తులను గుర్తించి తల్లిదండ్రులు సరైన దిశలో ప్రోత్సహించాలని కోరారు. ఈ రోజు వేదికపై మెరిసిన ప్రతి “షైనింగ్ స్టార్” వెనుక ఒక ఉపాధ్యాయుడి కృషి దాగి ఉందని కలెక్టర్ కొనియాడారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడం గురువుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలు, సంగీతం, కళలు వంటి పాఠ్యేతర కార్యక్రమాల్లోనూ విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. ఇవి ఒత్తిడిని తగ్గించి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని తెలిపారు. తాను సివిల్స్‌కు సిద్ధమవుతున్న సమయంలో కూడా క్రీడలు, ఇతర అభిరుచులకు సమయం కేటాయించడం వల్ల మానసిక ఒత్తిడిని అధిగమించగలిగానని వివరించారు.

తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ… విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పరీక్షలను విద్యార్థులు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. విద్యే జీవితంలో ఎవరూ దోచుకోలేని శాశ్వత సంపద అని పేర్కొంటూ, తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారి లక్ష్యసాధనకు తోడ్పడాలని సూచించారు. షైనింగ్ స్టార్స్–2026 కార్యక్రమం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్‌తో పాటు రూ.20,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా సన్మానించడం ద్వారా కుటుంబాల కృషిని గుర్తించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఇతర విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించి మరింత ప్రతిభ కనబర్చేందుకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థులకు వివిధ ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. చదువే శాశ్వత సంపద అని, విద్యతోనే వ్యక్తి, కుటుంబం, సమాజం గౌరవప్రదమైన స్థాయికి చేరుకుంటారని పేర్కొంటూ, అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేసి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

సూళ్ళురుపేట ఎం.ఎల్.ఎ. మాట్లాడుతూ విద్య జీవితానికి బలమైన పునాది అని, చదువుతో పాటు క్రమశిక్షణ, నిజాయితీ, పెద్దల పట్ల గౌరవం, సమాజంలో మెలగడం వంటి విలువలను కూడా పాఠశాలలే నేర్పుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ‘వన్ క్లాస్–వన్ టీచర్’, లీప్ యాప్, పాఠశాలల్లో యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు, పోషకాహారం, మోడల్ స్కూల్స్ వంటి పలు సంస్కరణలు అమలు చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సీఎస్‌ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నందుకు అభినందించారు. తన నియోజకవర్గం నుంచి షైనింగ్ స్టార్స్‌గా ఎంపికైన విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని పల్లవిని ప్రత్యేకంగా ప్రశంసించారు. విద్యార్థులు బాగా చదవాలని, ఉపాధ్యాయులు, పెద్దలను గౌరవించాలని, నిజాయితీతో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

రైల్వే కోడూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ… కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, నిర్వాహకులు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నేడు సత్కారం అందుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి మరింత ప్రతిభ కనబరిచేందుకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.

క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. విద్యార్థులు పరీక్షలను ఒత్తిడిగా కాకుండా ఒక అవకాశంగా భావించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు వారికి మానసిక ధైర్యాన్ని అందించాలని సూచించారు.

యాదవ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ బోధన, విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలను సాధించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు అండగా నిలవాలని కోరారు.

వన్నె కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను గతంలో పనిచేసిన రోజుల అనుభవాలను గుర్తు చేసుకుంటూ, సమాజంలో మార్పులు వచ్చినప్పటికీ సేవాభావం, సామాజిక బాధ్యత మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు సమాజంలో ఐక్యత, సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచన పెంపొందాలని సూచించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతున్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన 258 మంది విద్యార్థులకు “షైనింగ్ స్టార్స్–2026” పురస్కారాలు, చెక్కులు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి, వారిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దిశగా కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలకు ప్రతీకగా నిలిచిందని విద్యార్థులు, తల్లిదండ్రులు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్త పరిచారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
————————–

*డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.