Tuesday, 21 July 2026
  • Home  
  • ప్రభుత్వ భూమిపై పంచాయితీ.. కుంట్లూరులో వేడెక్కిన వివాదం
- News

ప్రభుత్వ భూమిపై పంచాయితీ.. కుంట్లూరులో వేడెక్కిన వివాదం

ప్రభుత్వ భూమిపై హక్కుల పోరు.. కుంట్లూరులో ఉద్రిక్తత సర్వే నంబర్–24లో ఇరువర్గాల వాదనలు – ఆక్రమణ యత్నాన్ని అడ్డుకున్న రెవెన్యూ అధికారులు అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 20: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు గ్రామంలోని సర్వే నంబర్–24లో ఉన్న ప్రభుత్వ భూమిపై వివాదం నెలకొనడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం 84 ఎకరాల 21 గుంటల ప్రభుత్వ భూమిలో పాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి వంటి ప్రజా అవసరాల కోసం కొంత భూమిని ఇప్పటికే కేటాయించగా, మిగిలిన రెండు నుంచి మూడు ఎకరాల స్థలంపై ప్రస్తుతం పలువురు తమ హక్కులను ప్రకటిస్తూ ముందుకు రావడంతో వివాదం ముదిరింది. గ్రామ గౌడ సంఘం ప్రతినిధులు ఈ స్థలాన్ని తమ సంఘానికి ప్రభుత్వం కేటాయించిందని పేర్కొంటూ జేసీబీలతో భూమిని చదును చేసే పనులు చేపట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో హయత్‌నగర్ రైతు సహకార సంఘం ప్రతినిధులు కూడా ఇదే సర్వే నంబరులో తమ సంఘ కార్యాలయ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 500 గజాల స్థలాన్ని అధికారికంగా కేటాయించిందని పేర్కొన్నారు. తమకు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సంఘ కార్యనిర్వహణ అధికారి మల్లికార్జున్ తెలిపారు. మరోవైపు కుంట్లూరుకు చెందిన చాడ ఎల్లయ్య కుటుంబ సభ్యులు కూడా తమ హక్కులను వినిపించారు. 1978లో ప్రభుత్వం తమతో పాటు 25 కుటుంబాలకు ఈ స్థలాన్ని కేటాయించిందని, అప్పటి నుంచి అక్కడే నివాసం ఉంటూ పశుపోషణతో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అనంతరం జీవో నంబర్–59 ప్రకారం 2022–23లో ఎమ్మార్వో కార్యాలయం ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టే సమయంలో కొందరు అడ్డుకుని నిర్మాణాలతో పాటు దేవాలయాన్ని కూడా కూల్చివేశారని ఆరోపించారు. తమకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రశాంతంగా నివసించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇరువర్గాలు తమ వద్ద ప్రభుత్వ అనుమతులు, కేటాయింపు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంటుండటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూమికి సంబంధించిన అసలు హక్కుదారులు ఎవరో తేల్చాలని, అన్ని రికార్డులను సమగ్రంగా పరిశీలించి పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ భూమిపై ఆక్రమణ జరుగుతోందన్న సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఆక్రమణ ప్రయత్నాలను నిలిపివేసి ప్రభుత్వ భూమిని పరిరక్షించారు. అనంతరం భూమికి సంబంధించిన అన్ని రికార్డులు, కేటాయింపు ఉత్తర్వులు, రెవెన్యూ పత్రాలను పరిశీలించిన తర్వాత చట్టప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ భూములపై ఎలాంటి అక్రమ ఆక్రమణలను సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు వివాదాలకు దిగకుండా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ప్రభుత్వ భూమిపై హక్కుల పోరు.. కుంట్లూరులో ఉద్రిక్తత

సర్వే నంబర్–24లో ఇరువర్గాల వాదనలు – ఆక్రమణ యత్నాన్ని అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 20:
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు గ్రామంలోని సర్వే నంబర్–24లో ఉన్న ప్రభుత్వ భూమిపై వివాదం నెలకొనడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం 84 ఎకరాల 21 గుంటల ప్రభుత్వ భూమిలో పాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి వంటి ప్రజా అవసరాల కోసం కొంత భూమిని ఇప్పటికే కేటాయించగా, మిగిలిన రెండు నుంచి మూడు ఎకరాల స్థలంపై ప్రస్తుతం పలువురు తమ హక్కులను ప్రకటిస్తూ ముందుకు రావడంతో వివాదం ముదిరింది.
గ్రామ గౌడ సంఘం ప్రతినిధులు ఈ స్థలాన్ని తమ సంఘానికి ప్రభుత్వం కేటాయించిందని పేర్కొంటూ జేసీబీలతో భూమిని చదును చేసే పనులు చేపట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో హయత్‌నగర్ రైతు సహకార సంఘం ప్రతినిధులు కూడా ఇదే సర్వే నంబరులో తమ సంఘ కార్యాలయ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 500 గజాల స్థలాన్ని అధికారికంగా కేటాయించిందని పేర్కొన్నారు. తమకు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సంఘ కార్యనిర్వహణ అధికారి మల్లికార్జున్ తెలిపారు.
మరోవైపు కుంట్లూరుకు చెందిన చాడ ఎల్లయ్య కుటుంబ సభ్యులు కూడా తమ హక్కులను వినిపించారు. 1978లో ప్రభుత్వం తమతో పాటు 25 కుటుంబాలకు ఈ స్థలాన్ని కేటాయించిందని, అప్పటి నుంచి అక్కడే నివాసం ఉంటూ పశుపోషణతో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అనంతరం జీవో నంబర్–59 ప్రకారం 2022–23లో ఎమ్మార్వో కార్యాలయం ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టే సమయంలో కొందరు అడ్డుకుని నిర్మాణాలతో పాటు దేవాలయాన్ని కూడా కూల్చివేశారని ఆరోపించారు. తమకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రశాంతంగా నివసించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఇరువర్గాలు తమ వద్ద ప్రభుత్వ అనుమతులు, కేటాయింపు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంటుండటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూమికి సంబంధించిన అసలు హక్కుదారులు ఎవరో తేల్చాలని, అన్ని రికార్డులను సమగ్రంగా పరిశీలించి పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రభుత్వ భూమిపై ఆక్రమణ జరుగుతోందన్న సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఆక్రమణ ప్రయత్నాలను నిలిపివేసి ప్రభుత్వ భూమిని పరిరక్షించారు. అనంతరం భూమికి సంబంధించిన అన్ని రికార్డులు, కేటాయింపు ఉత్తర్వులు, రెవెన్యూ పత్రాలను పరిశీలించిన తర్వాత చట్టప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అంతేకాకుండా ప్రభుత్వ భూములపై ఎలాంటి అక్రమ ఆక్రమణలను సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు వివాదాలకు దిగకుండా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.