Wednesday, 24 June 2026
  • Home  
  • విదేశీ విరాళాలపై కేంద్రం కఠిన నిబంధనలు
- Featured

విదేశీ విరాళాలపై కేంద్రం కఠిన నిబంధనలు

విదేశీ విరాళాలు స్వీకరించే స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీఓలు) కోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. విదేశీ నిధులను స్వీకరించే సంస్థలు తమ కార్యకలాపాల వివరాలను మరింత పారదర్శకంగా వెల్లడించాల్సి ఉంటుంది. సంస్థల వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమ ఖాతాలు, ప్రచురణలు, కార్యక్రమాల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఇప్పటికే నమోదైన సంస్థలు కూడా కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ సమాచారాన్ని నవీకరించాల్సి ఉంటుంది. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత పెంచడం, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం, జాతీయ భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త నిబంధనలు ఎన్‌జీఓల పనితీరుపై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.