వింజమూరు పట్టణ పరిధిలో నుడా అనుమతులు లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు పరిశీలన చేపట్టారు. డీఎల్పీవో వెంకటరమణ, డిప్యూటీ ఎంపీడీవో రామారావు, ఏవోలు పట్టణంలోని పలు లేఅవుట్లను పరిశీలించి వివరాలు సేకరించారు. పరిశీలనలో 4 లేఅవుట్లకు నుడా అనుమతులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మరో 2 లేఅవుట్లకు అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అనుమతులు లేని మిగిలిన 22 లేఅవుట్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నుడా అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వింజమూరులో ప్లాట్లు కొంటున్నారా..? నుడా అనుమతులపై అధికారుల పరిశీలన