Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

లిటిల్ గార్డెన్ స్కూల్ ఘటనపై పల్లా శ్రీనివాసరావు దిగ్భ్రాంతి విశాఖపట్నంలోని లిటిల్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
లిటిల్ గార్డెన్ స్కూల్ ఘటనపై పల్లా శ్రీనివాసరావు దిగ్భ్రాంతి విశాఖపట్నంలోని లిటిల్

వార్త ముఖ్యాంశాలు

  • లిటిల్ గార్డెన్ స్కూల్ ఘటనపై పల్లా శ్రీనివాసరావు దిగ్భ్రాంతి విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో బాలుడి మృతి ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
  • చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
  • ఈ ఘటనను ఇప్పటికే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

లిటిల్ గార్డెన్ స్కూల్ ఘటనపై పల్లా శ్రీనివాసరావు దిగ్భ్రాంతి

విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో బాలుడి మృతి ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనను ఇప్పటికే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఘటనపై వాస్తవాలను వెలికితీసేందుకు RJD, DEO, RDOలతో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపడతామని పల్లా శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *