Sunday, 16 August 2026
  • Home  
  • లక్ష్మిగారిపల్లెలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభం
- తిరుపతి

లక్ష్మిగారిపల్లెలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభం

రైల్వే కోడూరు నియోజకవర్గంలోని లక్ష్మిగారిపల్లెలో శనివారం అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రారంభించారు. డీఎఫ్‌ఓ జగన్నాథ్‌సింగ్‌తో కలిసి వుడ్ బ్యాంక్‌ను పరిశీలించారు. సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించి కళాకారులకు అవసరమైన కలపను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులు తయారు చేసిన చెక్క కళాకృతులు, సంప్రదాయ బొమ్మలను ఎమ్మెల్యే పరిశీలించి వాటి తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వుడ్ బ్యాంక్‌లో అందుబాటులో ఉన్న కలప వివరాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలపను సక్రమంగా వినియోగిస్తూ కళాకారులకు నిరంతరం ముడిసరుకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లక్ష్మిగారిపల్లె పరిసర ప్రాంతాల్లో సుమారు 140 నుంచి 230 మంది కళాకారులు కలప ఆధారిత హస్తకళలపై జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. సంప్రదాయ కళలకు వుడ్ బ్యాంక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, కళాకారుల సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, ఎన్డీఏ కూటమి నేతలు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.