అనంతగిరి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బెంచీలను పంపిణీ చేశారు.అనంతగిరి మండల కోఆర్డినేటర్ నరాజి మల్లేశ్వరరావు చేతుల మీదుగా పాఠశాలలకు బెంచీలను అందజేశారు.మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (TW),దాసరితోట పాఠశాల హెచ్ఎం,జాన్సి,అదేవిధంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, వంతవానిపాలెం, హెచ్ ఎం శ్రీదేవి,పిల్లల తల్లిదండ్రులు,మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు పాఠశాల ఆవరణలోనే బెంచీలను అందజేశారు.
విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని విద్యాభ్యాసం చేయడానికి అవసరమైన బెంచీలను అందించడం పట్ల పాఠశాలల హెచ్ఎంలు తల్లిదండ్రులు,విద్యార్థులు రోటరీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.



