అనకాపల్లి జిల్లా, మే 18 – పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్:
ఎలమంచిలి మండలం మేజర్ పంచాయతీ అయిన ఏటికొప్పాక గ్రామ సచివాలయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక ఆర్థిక అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. రైతుల ఆర్థిక భద్రత, పొదుపు అలవాట్లు, డిపాజిట్ పథకాలు, ఈ-కేవైసీ, రుణ సదుపాయాలపై యలమంచిలి బ్రాంచ్ మేనేజర్ మరియు బ్యాంక్ సిబ్బంది సమగ్రంగా వివరించారు.
సేవింగ్స్ ఖాతాలపై 3.50 శాతం వడ్డీ, మహిళా సంఘాలకు ప్రత్యేక రుణాలు, డోర్ డెలివరీ బ్యాంకింగ్ సేవలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మండల వైస్ ఎంపీపీ నగిరెడ్డి అచ్చయనాయుడు, మాజీ ప్రెసిడెంట్ కాండ్రకోట చిరంజీవి, స్కూల్ చైర్మన్ ఊడి రామకృష్ణ, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు హాజరై రైతులు బ్యాంకింగ్ సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ ప్రజలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

రైతు సంక్షేమమే ధ్యేయం… ఏటికొప్పాకలో డీసీసీబీ ఆర్థిక అవగాహన సదస్సుకు విశేష స్పందన
అనకాపల్లి జిల్లా, మే 18 – పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్: ఎలమంచిలి మండలం మేజర్ పంచాయతీ అయిన ఏటికొప్పాక గ్రామ సచివాలయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక ఆర్థిక అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. రైతుల ఆర్థిక భద్రత, పొదుపు అలవాట్లు, డిపాజిట్ పథకాలు, ఈ-కేవైసీ, రుణ సదుపాయాలపై యలమంచిలి బ్రాంచ్ మేనేజర్ మరియు బ్యాంక్ సిబ్బంది సమగ్రంగా వివరించారు. సేవింగ్స్ ఖాతాలపై 3.50 శాతం వడ్డీ, మహిళా సంఘాలకు ప్రత్యేక రుణాలు, డోర్ డెలివరీ బ్యాంకింగ్ సేవలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మండల వైస్ ఎంపీపీ నగిరెడ్డి అచ్చయనాయుడు, మాజీ ప్రెసిడెంట్ కాండ్రకోట చిరంజీవి, స్కూల్ చైర్మన్ ఊడి రామకృష్ణ, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు హాజరై రైతులు బ్యాంకింగ్ సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ ప్రజలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

