మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రైతులకు జూన్ 30లోపు రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. ఖరీఫ్ సీజన్‌కు ముందు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ హామీ ఇచ్చారు. రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. సమయానికి రుణాలు చెల్లించిన రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షపాతం తగ్గే అవకాశముందని హెచ్చరించారు. తక్కువ వర్షాలకు తగిన విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు సీఎం వెల్లడించారు. రైతులకు అవసరమైన రుణాలు త్వరగా అందించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు.

రైతు రుణమాఫీపై ఫడ్నవీస్ హామీ