తాళ్లపూడి పున్నమి ప్రతినిధి
ధర్మవరం, జూలై 17: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్వర్ణభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు పోలిశెట్టి వర్షాంజలి (596/600), బెల్లపుకొండ నయన వెంకట సత్యశ్రీ (593/600) రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక షైనింగ్ స్టార్ ప్రతిభ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పేరిచర్ల రామకృష్ణరాజు, ప్రిన్సిపాల్ పేరిచర్ల పద్మ, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. కొవ్వూరు మండలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్లో తమ పిల్లలు ఈ గౌరవం అందుకోవడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులకు ప్రత్యేక అభి



