Sunday, 27 September 2026
  • Home  
  • రూ.1.10 లక్షలకు గణనాథుడి లడ్డూ.. వడ్డే రాఘవేందర్–మమత దంపతుల సొంతం! ఎన్టీఆర్ నగర్‌లో హోరాహోరీగా లడ్డూ వేలంపాట.. భక్తుల్లో ఉత్సాహం
- రంగారెడ్డి

రూ.1.10 లక్షలకు గణనాథుడి లడ్డూ.. వడ్డే రాఘవేందర్–మమత దంపతుల సొంతం! ఎన్టీఆర్ నగర్‌లో హోరాహోరీగా లడ్డూ వేలంపాట.. భక్తుల్లో ఉత్సాహం

ఎల్బీనగర్: ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్–1లో ద్విముఖ వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లడ్డూను దక్కించుకునేందుకు పలువురు భక్తులు ఆసక్తి చూపడంతో వేలంపాట ఉత్సాహభరితంగా సాగింది. చివరకు రూ.1,10,000ల భారీ మొత్తానికి సీనియర్ జర్నలిస్ట్ వడ్డే రాఘవేందర్–మమత దంపతులు గణేష్ లడ్డూను దక్కించుకున్నారు. లక్షా పది వేల రూపాయల ధర పలకడం ఉత్సవాల్లో ప్రత్యేక విశేషంగా నిలిచింది. వేలంపాట సందర్భంగా భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని చాటారు. లడ్డూను దక్కించుకున్న వడ్డే రాఘవేందర్–మమత దంపతులను ద్విముఖ వినాయక యూత్ కమిటీ సభ్యులు అభినందించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులు, స్థానికులు, యువతకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎల్బీనగర్: ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్–1లో ద్విముఖ వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లడ్డూను దక్కించుకునేందుకు పలువురు భక్తులు ఆసక్తి చూపడంతో వేలంపాట ఉత్సాహభరితంగా సాగింది. చివరకు రూ.1,10,000ల భారీ మొత్తానికి సీనియర్ జర్నలిస్ట్ వడ్డే రాఘవేందర్–మమత దంపతులు గణేష్ లడ్డూను దక్కించుకున్నారు.

లక్షా పది వేల రూపాయల ధర పలకడం ఉత్సవాల్లో ప్రత్యేక విశేషంగా నిలిచింది. వేలంపాట సందర్భంగా భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని చాటారు.

లడ్డూను దక్కించుకున్న వడ్డే రాఘవేందర్–మమత దంపతులను ద్విముఖ వినాయక యూత్ కమిటీ సభ్యులు అభినందించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులు, స్థానికులు, యువతకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.