రాపూరు మండలం తెగచెర్లకు చెందిన వీరపురెడ్డి నారాయణరెడ్డి అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ నెల 10న మిస్సింగ్ కేసు నమోదైంది. అనంతరం పోలీసులు ప్రత్యేక బృందాలతో పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 10 గంటల సమయంలో తెగచెర్ల ఫారెస్ట్ ఏరియాలో నారాయణరెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు చేశారు. నారాయణరెడ్డి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ, అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ ఘటనతో తెగచెర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం లభ్యమైన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాపూరు అడవిలో నారాయణరెడ్డి మృతదేహం లభ్యం