రాజమహేంద్రవరం: ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్ (GTGH)లో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ఎమ్మెల్సీ Somu Veerraju, BJPPAVANKUMARB గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ ప్రాజెక్టు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) నిధుల ద్వారా రూ.23.75 కోట్లతో నిర్మిస్తున్నారు.
పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో చర్చించారు. పూర్తి అయిన తర్వాత ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు అత్యవసర మరియు ప్రత్యేక వైద్య సేవలు మెరుగ్గా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ పిక్కి నాగేంద్ర, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


