రాజమండ్రిలోని తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు ‘శాశ్వత లోక్ అదాలత్ – ప్రజా ఉపయోగ సేవలు’ (PLAPUS) ఉన్నత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన వివిధ ప్రభుత్వ & ప్రైవేటు సంస్థల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి & సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ విద్యుత్ సరఫరా, త్రాగు నీటి సరఫరా, పారిశుద్ధ్య, వైద్య, తపాలా, టెలిఫోన్, బ్యాంకింగ్ వంటి సేవలకు సంబంధించిన సమస్యలను PLAPUS నందు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ తరహా వివాదాలలో కోర్టు ఫీజు లేకుండా రాజీ మార్గం ద్వారా సత్వర పరిష్కారం పొందవచ్చని ఆమె అన్నారు. సంబంధిత సంస్థల వారు ఈ విధమైన వివాదాలను ‘PLAPUS’ ద్వారా దాదాపు కోటి రూపాయల వరకు పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

రాజమండ్రిలో శాశ్వత లోక్ అదాలత్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం