ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 24 (పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం మండలం గొలగమూడి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. జూనియర్ కళాశాలను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యాసామగ్రి, హాస్టల్ కిట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధికి కోట్ల రూపాయలతో మౌలిక వసతులు, క్రీడామైదానాలు, అదనపు భవనాల నిర్మాణ పనులు చేపడుతున్నామని చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.

మెగా పీటీఎంలో విద్యాభివృద్ధిపై సోమిరెడ్డి దృష్టి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 24 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం గొలగమూడి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. జూనియర్ కళాశాలను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యాసామగ్రి, హాస్టల్ కిట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధికి కోట్ల రూపాయలతో మౌలిక వసతులు, క్రీడామైదానాలు, అదనపు భవనాల నిర్మాణ పనులు చేపడుతున్నామని చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.

