ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 24 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం వీరంపల్లి జడ్పీ హైస్కూల్‌లో మెగా పీటీఎం-4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన నల్లగర్ల శ్రావ్య, గోవింద్ సందీప్, మంగళపూరి సుస్మితలను శాలువాలతో సన్మానించి, టీడీపీ యువనేత పొట్టేళ్ల ప్రసాద్ వరుసగా రూ.5,000, రూ.3,000, రూ.2,000 నగదు బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయి డ్రాయింగ్ పోటీలో ప్రతిభ చూపిన గోనుపల్లి అలకనందకు రూ.1,000 ప్రదానం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మెగా పీటీఎం-4.0లో ప్రతిభావంతుల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 24 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం వీరంపల్లి జడ్పీ హైస్కూల్‌లో మెగా పీటీఎం-4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన నల్లగర్ల శ్రావ్య, గోవింద్ సందీప్, మంగళపూరి సుస్మితలను శాలువాలతో సన్మానించి, టీడీపీ యువనేత పొట్టేళ్ల ప్రసాద్ వరుసగా రూ.5,000, రూ.3,000, రూ.2,000 నగదు బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయి డ్రాయింగ్ పోటీలో ప్రతిభ చూపిన గోనుపల్లి అలకనందకు రూ.1,000 ప్రదానం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

