Thursday, 27 August 2026
  • Home  
  • * మూడవరోజు ఉత్కంఠ హరితంగా సాగిన అమరావతి ఛాంపియన్‌షిప్ – 2026
- తిరుపతి

* మూడవరోజు ఉత్కంఠ హరితంగా సాగిన అమరావతి ఛాంపియన్‌షిప్ – 2026

*గెలుపే.. ధ్యేయం.. విజయమే… లక్ష్యం..* * మూడవరోజు ముఖ్యఅతిథిగా టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు. * నేడు పూర్తి స్థాయిలో లభించనున్న అమరావతి ఛాంపియన్‌షిప్ ఫలితాలు తిరుపతి (ఎస్వీయూ) – ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి తిరుపతిలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్‌ రాష్ట్రస్థాయి పోటీలను వీక్షించడానికి హాజరైన టీటీడీ బోర్డు చైర్మన్‌ బిఆర్ నాయుడు నూ తిరుపతి టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ జేబీ శ్రీనివాస్ తో కలిసి శాప్‌ చైర్మన్‌ రవి నాయుడు గారు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు చైర్మన్‌ బి.ఆర్. నాయుడు గారు మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్‌షిప్‌లో అన్ని క్రీడా పోటీలు విజయవంతంగా సాగాలని, క్రీడాకారులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. శాప్‌ చైర్మన్‌ రవి నాయుడు మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్‌షిప్‌ పోటీలు రెండు రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నాయనీ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మంది రాష్ట్రస్థాయి క్రీడాకారులకూ క్రీడలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందనీ, ఇంత భారీ స్థాయిలో క్రీడాకారులు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ఊహించని విధంగా రాష్ట్రస్థాయిలో మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. అదేవిధంగా యువత గంజాయి, డ్రగ్స్‌ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని రవి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వియు కోఆర్డినేటర్ డా. పత్తిపాటి వివేక్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు, తిరుపతి యువ నాయకులు హేమంత్ రాయల్, మహేష్ యాదవ్, శాప్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. *బ్యాడ్మింటన్ లో ఫైనల్ కు చేరిన అన్ని విభాగాలు:* యు-17 బాలుర సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్ లో తిరుపతి జిల్లా, పశ్చిమ గోదావరి విజయం, బాలుర డబుల్స్ సెమీ ఫైనల్స్ పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాలు, యు-23 పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్ లో తిరుపతి జిల్లా, కోనసీమ జిల్లాలు, యు-23 పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్స్ లో ఎన్టీఆర్ జిల్లా కాకినాడ పై 2-0, అనకాపల్లి జిల్లా పశ్చిమ గోదావరి పై 2-0 తో యు-17 బాలికల సింగిల్స్ సెమీ ఫైనల్స్ ప్రకాశం, కృష్ణ జిల్లాలు, యు-17 బాలికల డబుల్స్ సెమీ ఫైనల్స్ నెల్లూరు, ఎన్టీఆర్ లు, యు-23 మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్స్ లో కాకినాడ, తిరుపతి జిల్లాలు, యు-23 మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్ కాకినాడ విజయం, అన్నమయ్య లు అన్నమయ్య విజయం సాధించి విజయం సాధించి ఫైనల్ కి చేరుకున్నాయి. కబాడీ, బాస్కెట్బాల్, హాకీ , ఖో-ఖో లో నేడు సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరగనున్నాయి.

*గెలుపే.. ధ్యేయం.. విజయమే… లక్ష్యం..*
* మూడవరోజు ముఖ్యఅతిథిగా టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు.
* నేడు పూర్తి స్థాయిలో లభించనున్న అమరావతి ఛాంపియన్‌షిప్ ఫలితాలు
తిరుపతి (ఎస్వీయూ) – ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి
తిరుపతిలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్‌ రాష్ట్రస్థాయి పోటీలను వీక్షించడానికి హాజరైన టీటీడీ బోర్డు చైర్మన్‌ బిఆర్ నాయుడు నూ తిరుపతి టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ జేబీ శ్రీనివాస్ తో కలిసి శాప్‌ చైర్మన్‌ రవి నాయుడు గారు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు చైర్మన్‌ బి.ఆర్. నాయుడు గారు మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్‌షిప్‌లో అన్ని క్రీడా పోటీలు విజయవంతంగా సాగాలని, క్రీడాకారులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. శాప్‌ చైర్మన్‌ రవి నాయుడు మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్‌షిప్‌ పోటీలు రెండు రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నాయనీ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మంది రాష్ట్రస్థాయి క్రీడాకారులకూ క్రీడలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందనీ, ఇంత భారీ స్థాయిలో క్రీడాకారులు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ఊహించని విధంగా రాష్ట్రస్థాయిలో మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. అదేవిధంగా యువత గంజాయి, డ్రగ్స్‌ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని రవి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వియు కోఆర్డినేటర్ డా. పత్తిపాటి వివేక్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు, తిరుపతి యువ నాయకులు హేమంత్ రాయల్, మహేష్ యాదవ్, శాప్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

*బ్యాడ్మింటన్ లో ఫైనల్ కు చేరిన అన్ని విభాగాలు:* యు-17 బాలుర సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్ లో తిరుపతి జిల్లా, పశ్చిమ గోదావరి విజయం, బాలుర డబుల్స్ సెమీ ఫైనల్స్ పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాలు, యు-23 పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్ లో తిరుపతి జిల్లా, కోనసీమ జిల్లాలు, యు-23 పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్స్ లో ఎన్టీఆర్ జిల్లా కాకినాడ పై 2-0, అనకాపల్లి జిల్లా పశ్చిమ గోదావరి పై 2-0 తో యు-17 బాలికల సింగిల్స్ సెమీ ఫైనల్స్ ప్రకాశం, కృష్ణ జిల్లాలు, యు-17 బాలికల డబుల్స్ సెమీ ఫైనల్స్ నెల్లూరు, ఎన్టీఆర్ లు, యు-23 మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్స్ లో కాకినాడ, తిరుపతి జిల్లాలు, యు-23 మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్ కాకినాడ విజయం, అన్నమయ్య లు అన్నమయ్య విజయం సాధించి విజయం సాధించి ఫైనల్ కి చేరుకున్నాయి. కబాడీ, బాస్కెట్బాల్, హాకీ , ఖో-ఖో లో నేడు సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరగనున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.