నంద్యాల : 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ బి. శేషన్నకు ఉత్తమ పనితీరుకు ప్రశంసా పత్రం అందజేశారు. నంద్యాలలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు.మున్సిపల్ పరిపాలన, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సమర్థవంతంగా పనిచేసినందుకు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా బి. శేషన్న మాట్లాడుతూ ఈ ప్రశంసా పత్రం మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమిష్టి కృషికి దక్కిన గౌరవమని తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ బి. శేషన్నకు ప్రశంసా పత్రం