రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండల టీడీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగార్జున నాయుడు మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు లారీ సుబ్బారాయుడు, మించల అనంతయ్య యాదవ్, వెంకటేష్ రాజు, మాచినేని సుబ్బరామయ్య, పగడాల వెంకటేష్, సింగన హరిబాబు, మెకానిక్ చంద్రమౌళి, దేరంగుల వెంకటేష్, సుబ్బరాజు, మాచిన హరినాథ్, రాయన సుబ్బారాయుడు, నంద్యాల ధనంజయ, కందుల శివశంకర్, అద్భుత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








