ముదిగొండ/ ఖమ్మం
ముదిగొండ మండలం లోని
ముదిగొండ లో గల
ముది గొండ -లక్ష్మీపురం రహదారి విస్తరణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. 40 అడుగుల వెడల్పుతో రహదారిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా రోడ్డు పరిధిలోని ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జేసీబీలతో రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను కూల్చివేయడంతో వ్యాపారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కూల్చివేతల సమయంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రజల విజ్ఞప్తి మేరకే 40 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపడుతున్నామని అధికారులు తెలిపారు. రహదారి విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.



