Sunday, 2 August 2026
  • Home  
  • ముదిగొండలో రోడ్ల విస్తరణ.. కూల్చివేతలతో ఉద్రిక్తత
- ఖమ్మం

ముదిగొండలో రోడ్ల విస్తరణ.. కూల్చివేతలతో ఉద్రిక్తత

ముదిగొండ/ ఖమ్మం ముదిగొండ మండలం లోని ముదిగొండ లో గల ముది గొండ -లక్ష్మీపురం రహదారి విస్తరణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. 40 అడుగుల వెడల్పుతో రహదారిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా రోడ్డు పరిధిలోని ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జేసీబీలతో రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను కూల్చివేయడంతో వ్యాపారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కూల్చివేతల సమయంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రజల విజ్ఞప్తి మేరకే 40 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపడుతున్నామని అధికారులు తెలిపారు. రహదారి విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ముదిగొండ/ ఖమ్మం
ముదిగొండ మండలం లోని
ముదిగొండ లో గల
ముది గొండ -లక్ష్మీపురం రహదారి విస్తరణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. 40 అడుగుల వెడల్పుతో రహదారిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా రోడ్డు పరిధిలోని ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జేసీబీలతో రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను కూల్చివేయడంతో వ్యాపారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కూల్చివేతల సమయంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రజల విజ్ఞప్తి మేరకే 40 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపడుతున్నామని అధికారులు తెలిపారు. రహదారి విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.