వెదురుకుప్ప మండలం ఆగస్టు 05 పున్నమి ప్రతినిధి
*అమరావతి:* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జి.డి. నెల్లూరు ఎమ్మెల్యే *వి.ఎం. థామస్* మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను వివరించారు.
అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, ఎమ్మెల్యే వి.ఎం. థామస్ వెదురుకుప్పం మండల అధ్యక్షుడు కిషన్ చంద్ ను, ముఖ్యమంత్రి పరిచయం చేస్తూ, పార్టీ బలోపేతం కోసం ఆయన అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రధాన ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మిట్ట – పచ్చికాపలం – కార్వేటినగరం డబుల్ రోడ్డు నిర్మాణం అత్యవసర అవసరాన్ని కిషన్ చంద్, ఎమ్మెల్యే వి.ఎం. థామస్ సమక్షంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



