డా” బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) :
మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి ఆదేశాల మేరకు, మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి లంక గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఉద్యమంలో పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు కొమ్ముల రాము గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు పీతాని నరసింహారావు, పేరిచర్ల కుమార్ రాజు, దొమ్మేటి దుర్గారావు, సరేళ్ల అప్పారావు తదితరులు హాజరయ్యారు.


