నెల్లూరు జిల్లా | సంగం మండలం
మానవత్వాన్ని చాటుకున్న సంగం ఎస్సై భోజ్యా నాయక్
సంగం మండలం పెన్నా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని వెలికితీసిన అనంతరం, ఘటనాస్థలం నుంచి వాహనం వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో సంగం ఎస్సై భోజ్యా నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారు.
గ్రామస్తుల సహకారంతో కట్టెలు, వస్త్రాల సహాయంతో తాత్కాలిక స్ట్రెచర్‌ను తయారు చేసి, సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరం మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ నది గట్టు వరకు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎస్సై భోజ్యా నాయక్ స్వయంగా మృతదేహాన్ని మోసే కార్యక్రమంలో పాల్గొని, తన విధి నిర్వహణలో నిబద్ధతతో పాటు మానవత్వాన్ని కూడా చాటుకున్నారు. ఆయన సేవా భావాన్ని స్థానిక గ్రామస్తులు అభినందించారు.



