Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
News

గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడికి రూ.30 వేల ఆర్థిక సాయం

Punnami Newsroom Published:
గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడికి రూ.30 వేల ఆర్థిక సాయం

Story highlights

  • ఆత్మకూరు, జూలై 11 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆత్మకూరు టౌన్ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పోలు వెంకటేశ్వర్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం పరామర్శించి ధైర్యం చెప్పారు.
  • మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన నివాసానికి వెళ్లిన పార్టీ నాయకులు, వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుతం వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
  • ప్రమాద సమయంలో ఎదురైన ఇబ్బందులను తెలుసుకుంటూ కుటుంబ సభ్యులకు మనోధైర్యం నూరిపోశారు.

కొప్పోలు వెంకటేశ్వర్లును పరామర్శించిన వైఎస్సార్సీపీ నాయకులు – మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తరఫున సహాయం

ఆత్మకూరు, జూలై 11 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆత్మకూరు టౌన్ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పోలు వెంకటేశ్వర్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన నివాసానికి వెళ్లిన పార్టీ నాయకులు, వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుతం వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో ఎదురైన ఇబ్బందులను తెలుసుకుంటూ కుటుంబ సభ్యులకు మనోధైర్యం నూరిపోశారు. కష్టకాలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానమని పేర్కొన్నారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తరఫున కొప్పోలు వెంకటేశ్వర్లుకు రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని పార్టీ నాయకులు అందజేశారు. చికిత్సకు అవసరమైన సహాయ సహకారాల విషయంలో పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. వెంకటేశ్వర్లు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు, నాయకుల సంక్షేమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఆపద సమయంలో పార్టీ కుటుంబంలా అండగా నిలుస్తుందని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు కూనం సుధాకర్ రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, ఆత్మకూరు టౌన్ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, వైఎస్సార్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్టుకూరు సుబ్బారెడ్డి, నోటి వినయ్ కుమార్ రెడ్డి, ఆత్మకూరు రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోడేటి అశోక్, బాల చెన్నయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వెంకటేశ్వర్లుకు పరామర్శలు తెలియజేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *