Tuesday, 8 September 2026
  • Home  
  • *మాతమ్మ తిరునాళ్లకు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి సారె సమర్పణ*
- తిరుపతి

*మాతమ్మ తిరునాళ్లకు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి సారె సమర్పణ*

రామచంద్రాపురం సెప్టెంబర్ 08 పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలంలోని చిట్టతూరు గ్రామపంచాయతీలో ఆది ఆంధ్రవాడ నిర్వహిస్తున్న మాతమ్మ తిరునాళ్లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మంగళవారం హాజరయ్యారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మాతమ్మకు తెచ్చిన సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత మాతమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సూరావారిపల్లిలో పార్టీ సీనియర్ నేత బిక్కిరెడ్డిని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పరామర్శించారు. అమ్మవారికి సారె సమర్పణలో మండల పార్టీ అధ్యక్షులు ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు సిద్ధమునిరెడ్డి, మండల పార్టీ కార్యదర్శి మొగిలిరెడ్డి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యశ్వంత్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు కేశవులురెడ్డి, మండల కల్చరల్ వింగ్ అధ్యక్షులు భాస్కరయ్యలతో పాటు గ్రామస్తులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రామచంద్రాపురం సెప్టెంబర్ 08 పున్నమి ప్రతినిధి

రామచంద్రాపురం మండలంలోని చిట్టతూరు గ్రామపంచాయతీలో ఆది ఆంధ్రవాడ నిర్వహిస్తున్న మాతమ్మ తిరునాళ్లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మంగళవారం హాజరయ్యారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మాతమ్మకు తెచ్చిన సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత మాతమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సూరావారిపల్లిలో పార్టీ సీనియర్ నేత బిక్కిరెడ్డిని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పరామర్శించారు. అమ్మవారికి సారె సమర్పణలో మండల పార్టీ అధ్యక్షులు ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు సిద్ధమునిరెడ్డి, మండల పార్టీ కార్యదర్శి మొగిలిరెడ్డి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యశ్వంత్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు కేశవులురెడ్డి, మండల కల్చరల్ వింగ్ అధ్యక్షులు భాస్కరయ్యలతో పాటు గ్రామస్తులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.