ఆత్మకూరు, ఆగస్టు 20 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మండలం మహిమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ దేవానంద్ ఆధ్వర్యంలో సబ్యూనిట్ ఆఫీసర్ షేక్ ఖాదర్‌భాషా పీహెచ్సీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల దోమలు, వాటి ద్వారా వ్యాపించే వ్యాధులపై సిబ్బందికి అవగాహన కల్పించారు.అనంతరం మహిమలూరు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రధాన కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవానంద్ మాట్లాడుతూ మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుందని శాస్త్రీయంగా గుర్తించిన డాక్టర్ రోనాల్డ్ రాస్ సేవలను గుర్తు చేసుకున్నారు. దోమల నియంత్రణతోనే మలేరియా వంటి వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు.ఇంటి లోపల, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రజలకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ సౌందర్య, సూపర్వైజర్లు రాజేశ్వరి, సైదా, ఎల్టీ చంద్రమౌళి, హెల్త్ అసిస్టెంట్లు చిన్నప నాయుడు, జిలానీ బాష, ఆనంద్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మహిమలూరులో ప్రపంచ దోమల దినోత్సవంపై అవగాహన