పున్నమి ప్రతి నిధి
మధిర, ఖమ్మం జిల్లా :
మధిరలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె. చందర్ లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఒక భవన కార్మికుడు మరణించడంతో, అతని పేరు మీద మంజూరు అయ్యే ₹1,30,000 ఇన్సూరెన్స్ బిల్లు పాస్ చేయడానికి, ఆఫీసర్ చందర్ మృతుని భార్య నుండి ₹15,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితురాలు ఏసీబీని సంప్రదించగా, సన్నాహకంగా ఏర్పాటు చేసిన ఉచ్చులో ఖమ్మం రోడ్ పై లంచం తీసుకుంటుండగా చందర్‌ను అధికారులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ యాక్టివిటీలపై మాట్లాడిన రమేష్,
“అధికారులు తాము చేయవలసిన పనికి లంచం కోరితే వెనుకాడకుండా వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలి. అపోహలతో అధికారులు లంచాలు తీసుకోవడం, ప్రజలు ఇవ్వడం కొనసాగకూడదు,” అని స్పష్టం చేశారు.
పౌరుల హక్కులను రక్షించేందుకు ఏసీబీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎవరైనా లంచం డిమాండ్ చేసిన వెంటనే తమను సంప్రదించాలని డీఎస్పీ రమేష్ సూచించారు.


