మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారిని కలిసిన జడ్పీ డిప్యూటీ సీఈవో
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, జూలై 13. (పున్నమి ప్రతినిధి )
విజయనగరం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా నియమితులైన కే లవరాజు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో సోమవారం డిప్యూటీ సీఈఓ లవ రాజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అరకు వ్యాలీ ఎంపీడీవో గా విధులు నిర్వహించిన లవరాజు పదోన్నతి పొంది జడ్పీ డిప్యూటీ సీఈఓ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కి తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షిస్తూ, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.


