సకాలంలో వర్షాలు పడాలని కాంక్షిస్తూ బిజినేపల్లి మండలం మంగనూరులో ముదిరాజ్ సంఘం మహిళలు ఐదు రోజులుగా నిర్వహిస్తున్న వినూత్న పూజలు ముగిశాయి. ఐదో రోజు గ్రామంలో మంగళ హారతులతో ఊరేగింపుగా స్థానిక చెరువు కట్టకు చేరుకున్నారు. సాంప్రదాయ జానపద గేయాలు పాడుతూ గంగమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, జలాల్లో దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండాలని, రైతాంగం బాగుండాలని మహిళలు ఈ సందర్భంగా గంగదేవిని వేడుకున్నారు.
Uploaded Video:






