భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఆమెకు భరణం ఇవ్వాలని కోర్టులు తప్పనిసరిగా ఆదేశించాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. గృహహింస చట్టం లేదా ఇతర చట్టాల కింద దాఖలైన ప్రతి కేసులో భరణం మంజూరు చేయడం సరైన విధానం కాదని పేర్కొంది. భార్య తన జీవనోపాధిని స్వయంగా నిర్వహించగలిగితే, భర్తపై ఆర్థిక భారం మోపడం న్యాయసమ్మతం కాదని కోర్టు అభిప్రాయపడింది. భార్యకు పిల్లల సంరక్షణ వంటి అదనపు బాధ్యతలు ఉన్నాయా, ఆమె ఆదాయం ఎంత, భర్త ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే భరణంపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది.

భార్య ఆదాయం ఎక్కువైతే భరణం తప్పనిసరి కాదు: కర్ణాటక హైకోర్టు