కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా నిర్మాణ మహాసభలో భద్రాచలం డివిజన్‌కు చెందిన పలువురు నాయకులు జిల్లా కమిటీలో కీలక పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా సంయుక్త కార్యదర్శిగా సాధనపల్లి సతీష్, సహాయ కార్యదర్శిగా కొక్కిరేణి అశోక్‌కుమార్ ఎన్నికయ్యారు. జిల్లా కౌన్సిల్ సభ్యులుగా నారుపొంగు ఏసు, పసుపులేటి సాయిక్రాంతికుమార్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సాధనపల్లి సతీష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు. యువత నిరుద్యోగ సమస్యలపై ఉద్యమించకుండా కేంద్ర ప్రభుత్వం కుల, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. యువత, విద్యార్థులు ఐక్యంగా ఉద్యమిస్తే ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావచ్చని అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగం, యువత సమస్యలపై ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో పెద్దఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని సతీష్ తెలిపారు. తమను జిల్లా కమిటీలోకి ఎన్నుకున్న రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

భద్రాద్రి ఏఐవైఎఫ్‌లో భద్రాచలం నేతలకు కీలక పదవులు
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా నిర్మాణ మహాసభలో భద్రాచలం డివిజన్‌కు చెందిన పలువురు నాయకులు జిల్లా కమిటీలో కీలక పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా సంయుక్త కార్యదర్శిగా సాధనపల్లి సతీష్, సహాయ కార్యదర్శిగా కొక్కిరేణి అశోక్‌కుమార్ ఎన్నికయ్యారు. జిల్లా కౌన్సిల్ సభ్యులుగా నారుపొంగు ఏసు, పసుపులేటి సాయిక్రాంతికుమార్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సాధనపల్లి సతీష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు. యువత నిరుద్యోగ సమస్యలపై ఉద్యమించకుండా కేంద్ర ప్రభుత్వం కుల, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. యువత, విద్యార్థులు ఐక్యంగా ఉద్యమిస్తే ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావచ్చని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగం, యువత సమస్యలపై ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో పెద్దఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని సతీష్ తెలిపారు. తమను జిల్లా కమిటీలోకి ఎన్నుకున్న రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

