Friday, 28 August 2026
  • Home  
  • బాలాజి ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో ముందస్తు రాఖీ పండగ వేడుకలు;-
- జయశంకర్ భూపాలపల్లి

బాలాజి ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో ముందస్తు రాఖీ పండగ వేడుకలు;-

జయశంకర్ భూపాలపల్లి 28 ఆగస్టు (పున్నమి ప్రతినిధి)స్థానిక బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం మరియు రక్షణకు ప్రతీకగా రాఖీలు కట్టుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులకు రాఖీ పౌర్ణమి పండుగ యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన రంగురంగుల రాఖీలను ప్రదర్శించి, తమ స్నేహితులకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా బాలాజీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ, పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు విద్యార్థుల్లో ప్రేమ, ఐక్యత, సోదరభావం వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు.అలాగే స్థానిక ప్రిన్సిపాల్ రజినీకాంత్ మాట్లాడుతూ రక్ష బంధన్ అనేది అన్నదమ్ములు అక్కచెల్లెల కు ఇచ్చే భరోసా అని, అక్క చెల్లెల్ల కష్టసుఖాలలో పాలు పంచుకునే బాధ్యత అని తెలియజేశారు. అదేవిధంగా నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష మనందరం దేశానికి రక్ష అనే నినాదం తో ముందుకు సాగాలని తెలియజేశారు.ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిశాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి 28 ఆగస్టు (పున్నమి ప్రతినిధి)స్థానిక బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం మరియు రక్షణకు ప్రతీకగా రాఖీలు కట్టుకున్నారు.

కార్యక్రమంలో విద్యార్థులకు రాఖీ పౌర్ణమి పండుగ యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన రంగురంగుల రాఖీలను ప్రదర్శించి, తమ స్నేహితులకు రాఖీలు కట్టారు.
ఈ సందర్భంగా బాలాజీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ, పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు విద్యార్థుల్లో ప్రేమ, ఐక్యత, సోదరభావం వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు.అలాగే స్థానిక ప్రిన్సిపాల్ రజినీకాంత్ మాట్లాడుతూ రక్ష బంధన్ అనేది అన్నదమ్ములు అక్కచెల్లెల కు ఇచ్చే భరోసా అని, అక్క చెల్లెల్ల కష్టసుఖాలలో పాలు పంచుకునే బాధ్యత అని తెలియజేశారు. అదేవిధంగా నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష మనందరం దేశానికి రక్ష అనే నినాదం తో ముందుకు సాగాలని తెలియజేశారు.ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిశాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.