Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

హైదరాబాద్: ఫ్రెండ్షిప్ కప్‌లో రాఖీ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హైదరాబాద్: ఫ్రెండ్షిప్ కప్‌లో రాఖీ వేడుకలు

హైదరాబాద్, ఆగస్టు 28: AS SPORTS & EVENTS MANAGEMENT ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ ఇండో–శ్రీలంక ఫ్రెండ్షిప్ కప్–2026 క్రికెట్ టోర్నమెంట్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీలంక నుంచి టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు, సపోర్టింగ్‌ స్టాఫ్‌కు తెలంగాణ ఆర్గనైజర్స్ రాఖీలు కట్టి భారత్–శ్రీలంక స్నేహబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. క్రీడల ద్వారా రెండు దేశాల మధ్య స్నేహం, సోదరభావం, సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించినట్లు ఆర్గనైజర్ శ్రీరామ్ ఆంజనేయులు తెలిపారు. క్రీడలు దేశాల మధ్య స్నేహానికి వారధిగా నిలుస్తాయని, భారత్–శ్రీలంక క్రీడా సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శేఖర్, జయానంద్ పటేల్ సార్, పవన్, ప్రవీణ్ సార్, సతీష్, ప్రశాంత్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్: ఫ్రెండ్షిప్ కప్‌లో రాఖీ వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *