Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

బతుకమ్మ వేడుకల్లో కరాటే క్రీడాకారిణి భుక్య శ్రీవిద్యకు ఘన సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బతుకమ్మ వేడుకల్లో కరాటే క్రీడాకారిణి భుక్య శ్రీవిద్యకు ఘన సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • పాల్వంచ, రూరల్ అక్టోబర్ 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లో ని కొత్త సూరారం గ్రామంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
  • ఈ సందర్బంగా సింగరేణి జూనియర్ కళాశాల తరఫున కరాటేలో రాష్ట్రస్థాయికి ఎంపికైన భుక్య శ్రీవిద్యను గ్రామ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
  • కరాటే క్రీడలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణమని ఈ సందర్భంగా వారు కొనియాడారు.

పాల్వంచ, రూరల్ అక్టోబర్ 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లో ని కొత్త సూరారం గ్రామంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా సింగరేణి జూనియర్ కళాశాల తరఫున కరాటేలో రాష్ట్రస్థాయికి ఎంపికైన భుక్య శ్రీవిద్యను గ్రామ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
కరాటే క్రీడలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణ విద్య అయిన కరాటే నేర్చుకుని అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మాస్టర్ కోనే సూరిబాబు మార్గదర్శకత్వంలో కరాటేలో శిక్షణ పొందుతూ ప్రతిభ కనబరుస్తున్న భుక్య శ్రీవిద్య రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భుక్య జ్యోతి, మాజీ ఎంపీటీసీ భుక్య శంకర్, గ్రామ నాయకుడు భుక్య కిషన్ తదితరులు పాల్గొని భుక్య శ్రీవిద్యను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
క్రీడల్లో రాణిస్తున్న గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా మరింత మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించేందుకు అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *