Friday, 22 May 2026
  • Home  
  • బాలల హక్కుల పరిరక్షణకు సమిష్టి కృషి అవసరం జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి స్వరూప రాణి
- కుమురం భీమ్ ఆసిఫాబాద్

బాలల హక్కుల పరిరక్షణకు సమిష్టి కృషి అవసరం జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి స్వరూప రాణి

తేదీ: 22-05-2026 పున్నమి ప్రతినిధి కొమరం భీమ్,ఆసిఫాబాద్ : బాలల హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి స్వరూప రాణి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాల రక్షా భవన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ కోసం చేపడుతున్న చర్యలు, పోక్సో కేసుల పరిష్కారం, బాల్య వివాహాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలపై డీసీపీవో శ్రీ బి. మహేష్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో బాలల భద్రత, విద్య, ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె సూచించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై జరుగుతున్న వేధింపుల నిర్మూలనకు శాఖ సిబ్బంది సమన్వయంతో అంకితభావంతో పని చేయాలని ఆదేశించారు. ప్రతి బాలుడు సురక్షితమైన వాతావరణంలో ఎదగాల్సిన అవసరం ఉందని, బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె అన్నారు. అదేవిధంగా, బాలల సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమస్యాత్మక పరిస్థితుల్లో ఉన్న బాలలకు తక్షణ సహాయం అందించేలా చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీవో శ్రీ బి. మహేష్, బాల రక్షా భవన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తేదీ: 22-05-2026 పున్నమి ప్రతినిధి కొమరం భీమ్,ఆసిఫాబాద్ : బాలల హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి స్వరూప రాణి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాల రక్షా భవన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ కోసం చేపడుతున్న చర్యలు, పోక్సో కేసుల పరిష్కారం, బాల్య వివాహాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలపై డీసీపీవో శ్రీ బి. మహేష్‌ను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో బాలల భద్రత, విద్య, ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె సూచించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై జరుగుతున్న వేధింపుల నిర్మూలనకు శాఖ సిబ్బంది సమన్వయంతో అంకితభావంతో పని చేయాలని ఆదేశించారు. ప్రతి బాలుడు సురక్షితమైన వాతావరణంలో ఎదగాల్సిన అవసరం ఉందని, బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె అన్నారు.
అదేవిధంగా, బాలల సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమస్యాత్మక పరిస్థితుల్లో ఉన్న బాలలకు తక్షణ సహాయం అందించేలా చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీపీవో శ్రీ బి. మహేష్, బాల రక్షా భవన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.