బసినేనిపల్లిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం
సీతారామపురం మండలం బసినేనిపల్లి గ్రామంలోని హైస్కూల్ ప్రాంగణంలో పి4 కార్యక్రమం స్ఫూర్తితో జనసేన నాయకులు డా. బొగ్గవరపు శ్రీహర్ష ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, జనసేన రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గైనకాలజీ, దంత, నేత్ర, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ విభాగాల్లో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. డా. క్రాంతి, డా. హజరత్ కుమార్, డా. నవీన్, డా. కాసిఫా తదితరులు సేవలందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజలకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

బసినేనిపల్లిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం
బసినేనిపల్లిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం సీతారామపురం మండలం బసినేనిపల్లి గ్రామంలోని హైస్కూల్ ప్రాంగణంలో పి4 కార్యక్రమం స్ఫూర్తితో జనసేన నాయకులు డా. బొగ్గవరపు శ్రీహర్ష ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, జనసేన రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గైనకాలజీ, దంత, నేత్ర, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ విభాగాల్లో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. డా. క్రాంతి, డా. హజరత్ కుమార్, డా. నవీన్, డా. కాసిఫా తదితరులు సేవలందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజలకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

