Saturday, 29 August 2026
  • Home  
  • బసినేనిపల్లిలో ‘ఇంటింటికి తెలుగుదేశం’.. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బసినేనిపల్లిలో ‘ఇంటింటికి తెలుగుదేశం’.. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టి

బసినేనిపల్లిలో ‘ఇంటింటికి తెలుగుదేశం’.. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టి సీతారామపురం మండలం బసినేనిపల్లి గ్రామంలో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేదలు, మహిళలు, రైతులు, వృద్ధులు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, బసినేనిపల్లి అభివృద్ధికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

బసినేనిపల్లిలో ‘ఇంటింటికి తెలుగుదేశం’.. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టి
సీతారామపురం మండలం బసినేనిపల్లి గ్రామంలో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేదలు, మహిళలు, రైతులు, వృద్ధులు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, బసినేనిపల్లి అభివృద్ధికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.