ఖమ్మం, జూలై 30:
జిల్లాలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రతినిధులు కలెక్టర్ దివాకర్ టి.ఎస్.కు వినతిపత్రం సమర్పించారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని సండ్ర తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, బాధిత అభ్యర్థులు పాల్గొన్నారు.



