ఒడిశాలో పోలీస్ కస్టడీలో వ్యక్తి మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. గంజాం జిల్లాకు చెందిన సుశాంత్ సాహు పోలీసుల చిత్రహింసల కారణంగానే మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ అనంతరం ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేయడంతో పాటు ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. మానవ హక్కుల పరిరక్షణ విభాగంతో ప్రత్యేక దర్యాప్తు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు. పోలీస్ స్టేషన్ సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలించనున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

పోలీస్ కస్టడీలో వ్యక్తి మృతి.. ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్