ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు,కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి.
ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న శ్రీ సంగమేశ్వర హై స్కూల్ నందు మంగళవారం ప్రొద్దుటూరు ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అక్రమ పుస్తకాల అమ్మకాలను అడ్డుకుని ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి.
అనంతరం వారు మాట్లాడుతూ….
చదువు ను అడ్డుపెట్టుకొని వ్యాపారంగా మార్చుకున్న శ్రీ సంగమేశ్వర హై యాజమాన్యం పై వెంటనే చర్యలు తీసుకోవాలని అలాగే అన్ని మౌళిక సదుపాయాలు ఉన్నాయి అని బురిడీ మాట లతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతూ మా పాఠశాలలోనే పుస్తకాలు, షూస్ ఇతర సామాగ్రి మా దగ్గర కొనాలని ముక్కుమ్ జారీ చేసిన శ్రీ సంగమేశ్వర యాజమాన్యం పై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదువు బోధించాల్సిన విద్యాలయంలో వ్యాపారం చేయడం ఏంటని ఆశ్చర్య పోవడం జరిగింది. దీనిపైన మండల విద్యాశాఖ అధికారికి తెలియజేసిన కనీసం రెస్పాండ్ లేకపోవడం దుర్మార్గమైన విషయంగా వారు చెప్పారు. విద్యాసంస్థలకు తొత్తుగా మారుతున్న విద్యాశాఖ అధికారులు పై కూడా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి హెచ్చరిక చేశారు. ఇవే కాకుండా ప్రొద్దుటూరు పట్టణంలో విచ్చలవిడిగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్న విద్యాసంస్థలు ఉన్నాయి వాటిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలి.ముఖ్యంగా చదువునే వ్యాపారం మార్చుకున్న శ్రీ సంగమేశ్వర యాజమాన్యం పై వెంటనే చర్యలు తీసుకోని,విద్యాసంస్థ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దు రాహుల్, జిల్లా సహాయ కార్యదర్శి అభినయ్, హరి బాబు, ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు చార్లెష్,మధు, ప్రణవ్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


