పున్నమి ప్రతినిధి – కడప జిల్లా టుడే హైలైట్
పున్నమి ప్రతినిధి – కడప తేదీ: 21 సెప్టెంబర్ 2026 | సోమవారం
బద్వేల్లో హైటెక్ జూదం గుట్టురట్టు – 9 మంది అరెస్ట్
కడప, పున్నమి ప్రతినిధి: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో హైటెక్ పద్ధతిలో నిర్వహిస్తున్న అక్రమ జూదాన్ని పోలీసులు భగ్నం చేశారు. రామాంజనేయ నగర్లోని ఓ ఇంటిపై దాడి నిర్వహించి, ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలతో జూదం ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు.
పోలీసుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, జూదానికి ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచేందుకు చర్యలు చేపట్టినట్లు బద్వేల్ అర్బన్ పోలీసులు తెలిపారు.
పట్టణంలో జూదం, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ప్రజలు అనుమానాస్పద సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
పున్నమి ప్రతినిధి కడప

